బీసీలు, కాపులు ఎవరూ అసంతృప్తి చెందకుండా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంబంధిత అధికారులకు ఆదేశించారు.
విజయవాడ: బీసీలు, కాపులు ఎవరూ అసంతృప్తి చెందకుండా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన కాపు కార్పొరేషన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప, మంత్రులు పీ నారాయణ, గంటా శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, మాణిక్యాల రావు, కాపు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కొందరు కులసంఘాల నాయకులు తమ ఖాతాలో వేసుకుంటామంటే కుదరదన్నారు. కులాల కుమ్ములాటలు లేని సమాజ స్థాపనే తన ధ్యేయం అని అన్నారు. ఆర్థికంగా వెనుక బడిన కాపు కులస్తులను ఆదుకునేందుకు కాపు కార్పొరేషన్ పనిచేస్తుందని అన్నారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయసు 18-45 నుంచి 21-50కి పెంచుతున్నట్లు చెప్పారు.