రైట్‌ రాయల్‌గా కొనుక్కున్నా: కేకే | K Kesava Rao comments on land issue | Sakshi
Sakshi News home page

రైట్‌ రాయల్‌గా కొనుక్కున్నా: కేకే

Jun 12 2017 3:59 AM | Updated on Mar 18 2019 9:02 PM

రైట్‌ రాయల్‌గా కొనుక్కున్నా: కేకే - Sakshi

రైట్‌ రాయల్‌గా కొనుక్కున్నా: కేకే

ఇబ్రహీంపట్నంలో భూమికి సంబంధించి అన్నీ పరిశీలించిన తర్వాతే రైట్‌ రాయల్‌గా కొనుక్కున్నానని రాజ్యసభ సభ్యుడు, టీఆర్‌ఎస్‌ నేత కె.కేశవరావు చెప్పారు.

సాక్షి, హైదరాబాద్‌: ఇబ్రహీంపట్నంలో భూమికి సంబంధించి అన్నీ పరిశీలించిన తర్వాతే రైట్‌ రాయల్‌గా కొనుక్కున్నానని రాజ్యసభ సభ్యుడు, టీఆర్‌ఎస్‌ నేత కె.కేశవరావు చెప్పారు. ఆదివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇబ్ర హీంపట్నంలో భూమి కొన్న విషయం వాస్తవమని, దానికి సంబంధించి అన్ని పత్రాలూ ఉన్నాయన్నారు.

ఆ భూమిని 2011లో కొన్నానని, అప్పుడు కాంగ్రెస్‌ అధికారంలో ఉందని, టీఆర్‌ఎస్‌కు సంబంధం లేదని చెప్పారు. శంషాబాద్‌లో భూమి కొన్నట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమని, అక్కడ ఒక్క సెంటు కూడాలేదని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనుగోలు చేసిందేమీ లేదని, ఆ భూమి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేకే అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement