జూనియర్ డాక్టర్ల ప్రతినిధుల బృందం మంగళవారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యింది.
హైదరాబాద్ : జూనియర్ డాక్టర్ల ప్రతినిధుల బృందం మంగళవారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యింది. మెడికల్ పీజీ సీట్ల వివాదాన్ని జూనియర్ డాక్టరు ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. మెడికల్ పీజీ ఎంట్రన్స్ను రద్దు చేసి.... మళ్లీ నిర్వహించాలని జూడాలు గవర్నర్ను కోరారు.
కాగా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. పీజీ మెడికల్ ఎంట్రన్స్లో అక్రమాలు జరిగాయని వారు ఆరోపించారు. పరీక్ష మళ్లీ నిర్వహించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు.