అతి కిరాతకం! | Infant murder in Chintalakunta | Sakshi
Sakshi News home page

అతి కిరాతకం!

Sep 21 2014 9:37 AM | Updated on Jul 30 2018 8:29 PM

అతి కిరాతకం! - Sakshi

అతి కిరాతకం!

ఎల్బినగర్ చింతలకుంట పరిధిలో ఓ దారుణం జరిగింది. నెల రోజుల బాబును సవతి తల్లి, తండ్రి కలిసి అతికిరాతంగా చంపారని బాబు తల్లి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

 హైదరాబాద్: ఎల్బినగర్  చింతలకుంట పరిధిలో ఓ దారుణం జరిగింది.  నెల రోజుల బాబును సవతి తల్లి, తండ్రి కలిసి అతికిరాతకంగా చంపారని బాబు తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజు అనే వ్యక్తికి  సరితతో  రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరు  కొంతకాలంగా మధురానగర్‌లో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక నెల క్రితం బాబు పుట్టాడు.

అయితే రాజుకు గతంలో జయమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. రాజుకు, జయమ్మకు మధ్య మనస్పర్ధలు రావడంతో వారు విడిపోయారు. ఈ మధ్యకాలంలో  జయమ్మ తన పిల్లలతో కలసి రాజు, సరిత ఉంటున్న ఇంటికి వచ్చేసింది. మూడు రోజుల క్రితం అనారోగ్యంతో  ఆస్పత్రిలో చేరిన సరిత గత రాత్రి ఇంటికి వచ్చింది.  తెల్లవారేసరికి బాబు చనిపోయి ఉన్నాడు. తన భర్త, సవతి కలిసి బాబును హత్య చేసినట్లు సరిత ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement