రోడ్డు ప్రమాదంలో ఐసీఐసీఐ ఉద్యోగి మృతి | ICICI employee killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఐసీఐసీఐ ఉద్యోగి మృతి

Jul 5 2016 6:22 PM | Updated on Aug 30 2018 4:07 PM

ఎర్రగడ్డలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగి మృత్యువాతపడ్డాడు.

ఎర్రగడ్డలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగి మృత్యువాతపడ్డాడు. జేఎన్‌టీయూలోని ఐసీఐసీఐ బ్యాంకు శాఖలో పనిచేస్తున్న మురళీకృష్ణ బైక్‌పై వెళ్తుండగా మెట్రోస్టేషన్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మురళీకృష్ణ ఆస్పత్రికి తరలించేలోగానే చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్యాంకర్‌ను సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement