పాతబస్తీలో అర్థరాత్రి వరకు హల్చల్ చేస్తున్న యువతను కట్టడి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో రహదారులపై అర్థరాత్రి వరకు హల్చల్ చేస్తున్న యువతను కట్టడి చేసేందుకు పోలీసులు మరోసారి రంగంలోకి దిగారు. అందులోభాగంగా సోమవారం అర్థరాత్రి ఆపరేషన్ చబుత్రా పేరుతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారులపై హల్చల్ చేస్తున్న 221 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్న యువకుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
తల్లిదండ్రుల సమక్షంలో సదరు యువకులకు పురానీ హవేలిలోని సౌత్ జోన్ డీసీపీ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. మరోసారి ఈ విధంగా పట్టుబడినట్లు అయితే కేసులు పెడతామని యువకులను పోలీసులు హెచ్చరించనున్నారు.