ప్రత్యూష తండ్రి రమేష్ అరెస్టు

ప్రత్యూష తండ్రి రమేష్ అరెస్టు


* రిమాండ్‌కు తరలింపు

* నిర్భయ చట్టం కింద కేసు

హైదరాబాద్: కన్న కూతురు తన  సవతి తల్లి చేతిలో చిత్ర హింసలకు గురవుతున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరించిన   ప్రత్యూష తండ్రి చిప్పర రమేష్‌కుమార్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలిం చారు. ఆయనపై నిర్భయ కేసు, గృహ నిర్బం ధం, వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ మేరకు డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ గురువారం  విలేకరులకు వెల్లడించారు.బండ్లగూడ ఆనంద్‌నగర్‌లో సవతి తల్లి చేతిలో చిత్ర హింసకు గురవుతున్న  ప్రత్యూషను ఈ నెల 9న పోలీసులు విముక్తి కలిగించిన విషయం విదితమే. వేధింపులకు గురిచేసిన సవతి తల్లి చాముండేశ్వరిని ఆరోజే అరెస్టుచేసి రిమాండుకు పంపగా , ఈ సంఘటన జరిగినప్పటి నుంచీ పరారీలో ఉన్న ఆమె తండ్రి రమేష్ గురువారం పోలీసులకు చిక్కాడు. అతను  బోయిన్‌పల్లి ఎక్స్‌రోడ్డులో బంధువుల వద్ద ఆశ్రయం పొందుతున్నట్లు  తెలుసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.కుమార్తె చిత్రహింసలపై అతడిని పోలీసులు ప్రశ్నించగా తన మానసిక పరిస్థితి సరిగా లేదని పేర్కొన్నాడు.ఈ ఘటనలో ప్రత్యూష మేనమామ పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రమేష్‌కుమార్‌ను కస్టడీకి తీసుకుని  పూర్తి వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. నిందితుడిని  చూసిన స్థానికులు ఆగ్రహంతో  దాడి చేసేందుకు ప్రయత్నించారు.

 

ప్రత్యూషను పరామర్శించిన హైకోర్టు ప్రధాన అధికారి

అవేర్‌గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  ప్రత్యూషను హైకోర్టు ప్రత్యేక అధికారి ఎస్.శరత్‌కుమార్ పరామర్శించారు. ఆమె నుంచి వాంగ్మూలాన్ని సేకరించి రికార్డు చేశారు. ప్రత్యూష స్థితిగతులను స్వయంగా సమీక్షి ంచాలని హైకోర్టు సీజే ఆదేశాలు జారీ చేయడంతో ఆ మేరకు గురువారం ఉదయం ఆయన ఆస్పత్రికి చేరుకుని ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top