ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయి | Hyderabad boy married to American girl | Sakshi
Sakshi News home page

ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయి

Feb 5 2015 12:08 AM | Updated on Sep 2 2017 8:47 PM

ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయి

ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయి

హైదరాబాద్ అబ్బాయిని... అమెరికా అమ్మాయిని ప్రేమ ఏకం చేసింది. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పెళ్లి చేయించింది.

హైదరాబాద్ అబ్బాయిని... అమెరికా అమ్మాయిని ప్రేమ ఏకం చేసింది. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పెళ్లి చేయించింది. ఈ వేడుక బుధవారం ఎల్‌బీనగర్‌లో జరిగింది. దిల్‌సుఖ్‌నగర్ సత్యానగర్‌లోని నారాయణ, సీతారత్నంల కుమారుడు సత్యనారాయణ 2005 నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

ఐదేళ్ల క్రితం కాలిఫోర్నియాలోని యాటా నగరానికి చెందిన బ్యాంక్ ఉద్యోగి కార్లను ప్రేమించారు. ఆమె కూడా సత్యనారాయణను ప్రేమించింది. పెళ్లి చేసుకునేందుకు ఇద్దరూ తమ తల్లిదండ్రులను ఒప్పించారు. దీంతో ఈ ప్రేమజంట నగరానికి వచ్చి ఎల్‌బీనగర్‌లోని హోటల్ అభినందన్ గ్రాండ్‌లో కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.  

 - మన్సూరాబాద్
 
 

Advertisement
 
Advertisement
Advertisement