పెళ్లికి వెళ్లి వచ్చేలోపు ఊడ్చుకెళ్లాడు | Huge Robbery | Sakshi
Sakshi News home page

పెళ్లికి వెళ్లి వచ్చేలోపు ఊడ్చుకెళ్లాడు

Jul 3 2017 1:25 AM | Updated on Aug 30 2018 5:27 PM

పెళ్లికి వెళ్లి వచ్చేలోపు ఊడ్చుకెళ్లాడు - Sakshi

పెళ్లికి వెళ్లి వచ్చేలోపు ఊడ్చుకెళ్లాడు

ఓ బంగారం వ్యాపారి సమీప బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇల్లు దోచేశారు.

- బంగారం వ్యాపారి ఇంట్లో భారీ చోరీ
సుమారు రూ.68 లక్షల వస్తువులు మాయం
వంటవాడి పనే అని అనుమానం
 
హైదరాబాద్‌: ఓ బంగారం వ్యాపారి సమీప బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇల్లు దోచేశారు. హైదరాబాద్‌ పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భారీ చోరీ జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌–1 నవీన్‌నగర్‌లో ఉండే జితేందర్‌ కుమార్‌ గుప్తా అబిడ్స్‌లో బంగారం దుకాణం నడుపుతుం టాడు. శంషాబాద్‌లోని బంధువు ఇంట్లో వివాహం ఉండటంతో కుటుంబ సభ్యులంతా శనివారం వివాహానికి వెళ్లి ఆదివారం తెల్లవారుజామున 3 గంట లకు వచ్చారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి ఉంది.

అందులోని ఒక కిలో 14 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 కిలోల 100 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.3.5 లక్షల నగదు, రూ.4 లక్షల విలువచేసే గడియారం చోరీ కి గురయ్యాయి. గుప్తా ఇంట్లో రాంప్రసాద్‌ అనే వృద్ధుడితో పాటు బిహార్‌లోని దర్బంగ్‌ జిల్లాకు చెందిన ఉమేశ్‌ వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఆభరణాలు చోరీ కావడంతో అనుమానం వచ్చి తమ్ముడు నవీన్‌తో కలసి జితేందర్‌.. ఉమేశ్‌ ఇంటికి వెళ్లాడు. అప్పుటికే అతను పరారయ్యాడు. దీంతో ఉమేశ్‌ ఈ దొంగ తనం చేసి ఉండవచ్చని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉమేశ్‌ బంధువులను విచారిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement