శేరిలింగంపల్లిలో టీడీపీ ఖాళీ | huge damage to tdp in telangana | Sakshi
Sakshi News home page

శేరిలింగంపల్లిలో టీడీపీ ఖాళీ

Jan 22 2016 2:11 PM | Updated on Aug 10 2018 8:16 PM

తెలుగు తమ్ముళ్ల తిరుగుబావుటాతో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న టీడీపీకి మరో షాక్ తగిలింది.

హైదరాబాద్ : తెలుగు తమ్ముళ్ల తిరుగుబావుటాతో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న టీడీపీకి మరో షాక్ తగిలింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టిక్కెట్ ఆశించి.. భంగ పడిన నాయకులు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.

తాజాగా శేరిలింగంపల్లి టీడీపీ ముఖ్యనాయకులు బండి రమేష్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నారు. అదే విధంగా చందానగర్ లో మాజీ కార్పొరేటర్ తో సహా టిక్కెట్ ఆశించిన ముఖ్యనాయకులు టీఆర్ఎస్ పార్టీ లో చేరనున్నారు. దీంతో శేరిలింగంపల్లిలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement