ఓటుకు కోట్లు కేసు: తీర్పు వాయిదా | high court reserves decision in notes for vote case | Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు కేసు: తీర్పు వాయిదా

Published Tue, Nov 22 2016 3:37 PM | Last Updated on Tue, Oct 30 2018 4:08 PM

ఓటుకు కోట్లు కేసు: తీర్పు వాయిదా - Sakshi

ఓటుకు కోట్లు కేసు: తీర్పు వాయిదా

ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఇప్పటికి పలు దఫాలుగా ఈ కేసులో వాదనలు జరిగాయి. ఎమ్మెల్యే ఆర్కే తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. మధ్యలో ఈ కేసులో చంద్రబాబు పాత్రపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా తన వాదనలు వినిపించారు. మొత్తానికి ఈ కేసులో వాదనలు మంగళవారంతో ముగిసినట్లు హైకోర్టు ప్రకటించి, తీర్పును వాయిదా వేసింది. త్వరలోనే దీనిపై తుది ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. 
 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement