విద్యార్థుల కోసం పుస్తకాలపై ‘1098’ | helpline to the students about complain over harassment | Sakshi
Sakshi News home page

విద్యార్థుల కోసం పుస్తకాలపై ‘1098’

Sep 12 2017 12:11 AM | Updated on Sep 19 2017 4:22 PM

పాఠశాలల్లో, బయట విద్యార్థులను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తే చర్యలు తప్పవని విద్యా శాఖ హెచ్చరించింది.

వేధింపులపై ఫిర్యాదులు చేసేందుకు హెల్ప్‌లైన్‌ ఏర్పాటు 
 
సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలల్లో, బయట విద్యార్థులను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తే చర్యలు తప్పవని విద్యా శాఖ హెచ్చరించింది. వేధింపులకు గురి చేసే వారిపై ఫిర్యాదు చేసేందుకు పాఠ్య పుస్తకాల వెనుక భాగంలో టోల్‌ ఫ్రీ నంబర్‌ ‘1098’ను ముద్రించినట్లు తెలిపింది.

పాఠశాలల్లో సమస్యలపై విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు 18004257462 టోల్‌ ఫ్రీ నంబర్‌  ఏర్పాటు చేసింది. సర్వ శిక్షా అభియాన్, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో సమస్యలపై 18004253525 టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement