'భావప్రకటన స్వేచ్ఛ వారికేనా..' | hcu abvp leader susheel kumar comments | Sakshi
Sakshi News home page

'భావప్రకటన స్వేచ్ఛ వారికేనా..'

Feb 4 2016 4:43 PM | Updated on Jul 26 2019 5:38 PM

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలకు వెళ్లి నిజాలను బయటపెడతానని హెచ్సీయూ ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ అన్నారు.

ఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలకు వెళ్లి నిజాలను బయటపెడతానని హెచ్సీయూ ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. అంబేడ్కర్ యూనియన్ ఆగడాలను ప్రశ్నిస్తే తనను దారుణంగా కొట్టారని తెలిపారు. భావప్రకటన స్వేచ్ఛ కేవలం వారికేనా మాకు లేదా అని సుశీల్ కుమార్ ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ, కేజ్రీవాల్లు యాకుబ్ మెమన్కు మద్దతిస్తున్నారా అని ప్రశ్నించిన సుశీల్ కుమార్.. ఇది దేశభక్తులకు ప్రత్యర్థులతో జరుగుతున్న పోరాటంగా తెలిపారు. ఒక్క రోహిత్ ఆత్మహత్య గురించే కాకుండా యూనివర్సిటీలో జరిగిన అన్ని ఆత్మహత్యలపై విచారణ జరపాలన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement