హెచ్‌1బీ వీసాలు ఇప్పిస్తానని.. | H1B visa fraud in hyderabad | Sakshi
Sakshi News home page

హెచ్‌1బీ వీసాలు ఇప్పిస్తానని..

Apr 26 2017 1:17 PM | Updated on Sep 5 2017 9:46 AM

హెచ్‌1బీ వీసాలు ఇప్పిస్తానని ఆన్‌లైన్‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌: హెచ్‌1బీ వీసాలు ఇప్పిస్తానని ఆన్‌లైన్‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌ జిల్లా కాజీపేటకు చెందిన యాదవ్‌రెడ్డి ఆన్‌లైన్‌ ద్వారా వీసాలు ఇప్పిస్తానని చెప్పి అమాయకుల నుంచి భారీగా డబ్బు గుంజుతున్నాడు. నగరంలోని ఖైరతాబాద్‌ ప్రాంతానికి చెందిన రవీందర్‌ అనే యువకుడి నుంచి రూ. 2 లక్షలు తీసుకొని వీసా ఇప్పించకపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి యాదవ్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement