అమెరికా వలస నిబంధనలు మరింత కఠినం | Donald Trump Ends 540-Day Automatic Work Permit Extension | Sakshi
Sakshi News home page

అమెరికా వలస నిబంధనలు మరింత కఠినం

Oct 17 2026 5:20 AM | Updated on Oct 17 2026 5:20 AM

Donald Trump Ends 540-Day Automatic Work Permit Extension

వాషింగ్టన్‌: అమెరికాలోని ట్రంప్‌ ప్రభుత్వం వలస నిబంధనలను మరింత కఠినం చేసింది. హెచ్‌–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములతో సహా వర్క్‌ పర్మిట్‌ల (ఉద్యోగ అనుమతులు) ఆటోమేటిక్‌ పొడిగింపును మంజూరు చేసే విధానాన్ని తాజాగా రద్దు చేసింది. వర్క్‌ ఆథరై జేషన్‌ డాక్యుమెంట్ల (ఈఏడీ) పొడిగింపు దరఖా స్తులు పెండింగ్‌లో ఉన్న సమయంలో ఈ ఆటోమేటిక్‌ పొడిగింపు లభించేది. 

ఈ నిర్ణయం భారతీయులతో సహా అనేక మంది విదేశీ నిపుణులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన మధ్యంతర ఉత్తర్వును గతేడాది అక్టోబర్‌ 30వ తేదీన విడుదలచేయగా, యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) బుధవారం తుది నిబంధనను ఖరారు చేసింది. యూఎస్‌సీ ఐఎస్‌లో ప్రాసెసింగ్‌ ఆలస్యాన్ని నివారించడానికి, రెన్యూవల్‌ దరఖాస్తుల సంఖ్యను తగ్గించడానికి అధ్యక్షుడు బైడెన్‌ హయాంలో 2022 మేలో ఈఏడీ పర్మిట్ల కోసం 540 రోజుల ఆటోమేటిక్‌ పొడిగింపును ప్రవేశపెట్టారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement