గన్ మిస్‌ఫైర్: నర్సాపూర్ ఎమ్మెల్యే డ్రైవర్ మృతి | gun misfire leads to mla driver's death | Sakshi
Sakshi News home page

గన్ మిస్‌ఫైర్: నర్సాపూర్ ఎమ్మెల్యే డ్రైవర్ మృతి

Feb 16 2016 3:18 PM | Updated on Sep 29 2018 5:26 PM

గన్ మిస్‌ఫైర్: నర్సాపూర్ ఎమ్మెల్యే డ్రైవర్ మృతి - Sakshi

గన్ మిస్‌ఫైర్: నర్సాపూర్ ఎమ్మెల్యే డ్రైవర్ మృతి

హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాల్పులు కలకలం రేపాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డ్రైవర్ అక్బర్ మంగళవారం మధ్యాహ్నం మరణించాడు.

హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాల్పులు కలకలం రేపాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డ్రైవర్ అక్బర్ మంగళవారం మధ్యాహ్నం మరణించాడు. తొలుత అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే.. గన్‌మన్ నుంచి గన్ తీసుకుని దాన్ని చూస్తుండగా మిస్‌ఫైర్ అయ్యి, బుల్లెట్ బయటకు వచ్చి అతడు మరణించినట్లు తర్వాత తేలింది.

గన్‌మన్, డ్రైవర్ ఇద్దరూ వాహనం దగ్గరే ఉండటం, ఎమ్మెల్యే లోపలకు వెళ్లడంతో గన్ మన్ వద్ద ఉన్న తుపాకిని అక్బర్ తీసుకుని చూస్తున్నట్లు తెలిసింది. అంతలో.. అది పొరపాటున పేలడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మొత్తమ్మీద తుపాకి చూడాలన్న సరదా.. నిండు ప్రాణాలను బలిగొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement