సింధు, గోపీచంద్కు అనుకోని ఆతిథ్యం | Governor narasimhan felicitate pv sindhu, gopichand in rajbhavan | Sakshi
Sakshi News home page

సింధు, గోపీచంద్కు అనుకోని ఆతిథ్యం

Aug 22 2016 7:35 PM | Updated on Sep 4 2017 10:24 AM

సింధు, గోపీచంద్కు అనుకోని ఆతిథ్యం

సింధు, గోపీచంద్కు అనుకోని ఆతిథ్యం

ఒలింపిక్ విజేత పీవీ సింధు, ఆమె కోచ్ గోపీచంద్కు రాజ్భవన్లో అనుకోని ఆతిథ్యం లభించింది.

హైదరాబాద్ : ఒలింపిక్ విజేత పీవీ సింధు, ఆమె కోచ్ గోపీచంద్కు రాజ్భవన్లో అనుకోని ఆతిథ్యం లభించింది. మర్యాదపూర్వకంగా రాష్ట్ర గవర్నర్ను కలిసేందుకు వెళ్లిన వారిని అపూర్వ స్వాగతం లభించింది. అంతేకాకుండా గవర్నర్ నరసింహన్ దంపతులు...సింధుతో పాటు కోచ్ గోపీచంద్ను సత్కరించారు. అంతేకాకుండా కేక్ కట్ చేయించి,  ఇద్దరికీ జ్ఞాపికలు అందజేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ సింధు మ్యాచ్లను ఆసక్తిగా చూశానన్నారు. ఈ తరం యువతకు సింధు రోల్ మోడల్ అని కొనియాడారు. క్రమశిక్షణ, అంకిత భావమే సింధు ఉన్నతస్థాయికి తెచ్చారన్నారు. వీరు మెడల్ కోసం కాదని, దేశం కోసం ఆడారని ప్రశంసించారు. కాగా తమకు అందిన సత్కారంపై గోపీచంద్ మాట్లాడుతూ... తాము గవర్నర్ను కలవటానికి వెళ్లామని, అయితే ఆయన తమను సత్కరించి ఆశ్చర్యపరిచారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement