జీవో 123పై సోమవారం హైకోర్టు డివిజన్ బెంచ్లో విచారణ జరిగింది.
హైదరాబాద్ : జీవో 123పై సోమవారం హైకోర్టు డివిజన్ బెంచ్లో విచారణ జరిగింది. భూ నిర్వాసితులు, రైతు కూలీల రక్షణ కోసం తీసుకునే చర్యలను తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ద్వారా కోర్టుకు సమర్పించింది. నిబంధనల ప్రకారమే నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నామని... వ్యవసాయ కూలీలను ఆదుకుంటామని అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఆ అఫిడవిట్లో విన్నవించారు. మరోవైపు పిటిషనర్ తరఫు న్యాయవాది రేపటి వరకూ గడువు కోరడంతో విచారణ రేపటికి వాయిదా పడింది. కాగా 123 జీవో రద్దును హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది.