డిగ్రీ, డీఎడ్‌ వారికి అవకాశమివ్వండి! | Give them chance to Degree, D ED ! | Sakshi
Sakshi News home page

డిగ్రీ, డీఎడ్‌ వారికి అవకాశమివ్వండి!

Feb 11 2017 3:34 AM | Updated on Sep 5 2017 3:23 AM

డిగ్రీ, డీఎడ్‌ వారికి అవకాశమివ్వండి!

డిగ్రీ, డీఎడ్‌ వారికి అవకాశమివ్వండి!

గురుకులాల్లోని ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టుల్లో డిగ్రీ, డీఎడ్‌ పూర్తి చేసినవారికి అవకాశం కల్పించాలని

  • ‘గురుకుల’ పోస్టుల భర్తీలో అభ్యర్థుల విజ్ఞప్తి
  • ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిందేనని వెల్లడి
  • సాక్షి, హైదరాబాద్‌: గురుకులాల్లోని ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టుల్లో డిగ్రీ, డీఎడ్‌ పూర్తి చేసినవారికి అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం 6, 7, 8 తరగతులకు బోధించే వారికి.. డిగ్రీతోపాటు రెండేళ్ల డీఎడ్‌ ఉంటే అవకాశం ఇవ్వవచ్చు. కానీ ‘గురుకుల’నోటిఫికేషన్‌లో వారికి అవకాశం ఇవ్వలేదు. తాజాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల నేపథ్యంలో జారీ చేయనున్న సవరణ నోటిఫికేషన్‌లో అయినా డిగ్రీ–డీఎడ్‌ అభ్యర్థులకు అవకాశమిస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. తద్వారా దాదాపు లక్ష మంది అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర డీఎడ్‌ అభ్యర్థుల సంఘం ప్రతినిధులు రామ్మోహన్‌రెడ్డి, శ్రీను నాయక్, సరస్వతి తదితరులు పేర్కొన్నారు.

    సాధారణ వయో పరిమితి పెంపు ఉంటుందా?
    గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించి సాధారణ గరిష్ట వయో పరిమితిని 39 ఏళ్లకు పెంచాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. రాష్ట్రంలో యూనిఫాం పోస్టులు మినహా మిగతా ప్రభుత్వ ఉద్యోగాలకు సాధారణ గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుగా ఉంది. అప్పుడప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే ప్రత్యేక సడలింపులు మినహా చాలా ఏళ్లుగా ఇదే అమలవుతోంది. ప్రభుత్వ స్కూళ్లలోని టీచర్‌ పోస్టులకు మాత్రం 39 ఏళ్ల సాధారణ గరిష్ట వయోపరిమితి ఉంది. ఇక మోడల్‌ స్కూళ్లలో టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీకి కూడా దీనిని వర్తింపజేసింది. అదనంగా సామాజిక వర్గాల రిజర్వేషన్‌ను అమలు చేసింది. అయితే గురుకుల టీచర్‌ పోస్టులకు 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితి అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీలోనూ 39 ఏళ్ల సాధారణ గరిష్ట వయోపరిమితిని కొనసాగిం చాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తు న్నారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ జారీ కానందున.. ప్రస్తుత నోటిఫికేషన్‌లో వయో పరిమితి పెంచి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

    పదేళ్ల ప్రత్యేక సడలింపుతో..
    ఉమ్మడి రాష్ట్రంలో 2011 తరువాత ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో టీచర్‌ పోస్టులు, ఇతర శాఖల్లో పోస్టులను భర్తీ చేయలేదు. గతేడాది మాత్రం టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూప్‌–2, ఇంజనీర్లు, ఇతర విభాగాల్లోని పలు పోస్టుల భర్తీ చేపట్టారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో పెద్దగా ఉద్యోగాల భర్తీ లేనందున పదేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు ఇచ్చి.. 44 ఏళ్లకు పెంచారు. తాజాగా గురుకుల పోస్టులకు కూడా దీనిని వర్తింపజేస్తోంది. అయితే టీచర్‌ పోస్టులకు 39 ఏళ్ల సాధారణ గరిష్ట వయోపరిమితిని కొనసాగిస్తూనే.. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక సడలింపును అమలు చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. తద్వారా వేల మందికి అవకాశం కల్పించినట్లు అవుతుందని పేర్కొంటున్నారు. ఈ విçషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement