ఈ నెల 30వరకు ఏపీ, తెలంగాణలో చల్లని గాలులు | Freeze cold waves to be continued till Dec 30 in telugu states | Sakshi
Sakshi News home page

ఈ నెల 30వరకు ఏపీ, తెలంగాణలో చల్లని గాలులు

Dec 26 2015 4:48 PM | Updated on Apr 7 2019 4:30 PM

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉభయరాష్ట్రాల్లో చలిపంజా విసురుతోంది. ఇరురాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉభయరాష్ట్రాల్లో చలిపంజా విసురుతోంది. ఇరురాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఉదయం, సాయంకాలం వేళల్లో అతి శీతల గాలుల బలంగా వీస్తున్నాయి. గాలుల తీవ్రత రోజురోజుకీ పెరుగుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు.

చలీగాలుల తాకిడికి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. మరో ఐదురోజుల పాటు చల్లని గాలుల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 30 వరకు తెలుగు ఉభయరాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో అతి శీతల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement