పోలీస్ అకాడమిలో వివిధ పనులకు శంకుస్థాపన | Foundation for development works in police academy | Sakshi
Sakshi News home page

పోలీస్ అకాడమిలో వివిధ పనులకు శంకుస్థాపన

Nov 9 2016 1:43 PM | Updated on Aug 21 2018 11:41 AM

తెలంగాణ పోలీస్ అకాడమిలో వివిధ అభివృద్ధి పనులకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం భూమి పూజ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమిలో వివిధ అభివృద్ధి పనులకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం భూమి పూజ చేశారు. మోడల్ పోలీసు స్టేషన్, క్లాస్ రూమ్ బ్లాక్, ఇండోర్ స్పోర్ట్సు కాంప్లెక్సుకు శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్లతో మోడల్ పోలీస్ స్టేషన్, రూ.2.40 కోట్లతో క్లాస్ రూమ్ బ్లాక్, రూ.15.20 కోట్లతో ఇండోర్ స్పోర్ట్సు కాంప్లెక్సును నిర్మించనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌తోపాటు డీజీపీ అనురాగ్ శర్మ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement