నకిలీ బ్రాండెడ్ వస్త్రాలు సీజ్: కేసు నమోదు | fake branded clothes seized at sr nagar in hyderabad | Sakshi
Sakshi News home page

నకిలీ బ్రాండెడ్ వస్త్రాలు సీజ్: కేసు నమోదు

Jun 4 2016 11:29 AM | Updated on Sep 4 2017 1:40 AM

నకిలీ బ్రాండెడ్ వస్త్రాలను విక్రయిస్తున్న రెండు షాపులపై ఎస్‌ఆర్ నగర్ పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు.

హైదరాబాద్: నకిలీ బ్రాండెడ్ వస్త్రాలను విక్రయిస్తున్న రెండు షాపులపై ఎస్‌ఆర్ నగర్ పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు. ఎస్‌ఆర్ నగర్ ప్రాంతంలోని అటైర్స్, గ్రాబిట్ పేరుతో ఉన్న దుకాణాల్లో నకిలీ ముఫ్తి జీన్స్ విక్రయిస్తున్నట్టు ఆ కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసులు సదరు షాపులపై దాడి చేసి... 49 ప్యాంట్లు, టీ షర్టులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేశారు. షాపు యజమానులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement