లాంగ్‌ రైడ్‌ .. డబ్బుతో పట్టుబడ్డ మైనర్లు | Escaped Minor boys from Rajahmundry cought in LB nagar | Sakshi
Sakshi News home page

లాంగ్‌ రైడ్‌ .. డబ్బుతో పట్టుబడ్డ మైనర్లు

Sep 13 2017 4:35 PM | Updated on Sep 19 2017 4:30 PM

మైనర్‌ బాలురు, ఇన్‌సెట్‌లో వారి బ్యాగులో లభించిన డబ్బు

మైనర్‌ బాలురు, ఇన్‌సెట్‌లో వారి బ్యాగులో లభించిన డబ్బు

కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇంటి నుంచి పారిపోయి నగరానికి వచ్చిన ఇద్దరు మైనర్‌ బాలురు అనూహ్యరీతిలో పోలీసులకు చిక్కారు.

హైదరాబాద్:
ఇంట్లో డబ్బుతో ఉడాయించి స్కూటీపై హైదరాబాద్‌ వచ్చి ఎంజాయ్‌ చేయాలనుకున్న ఇద్దరు మైనర్లు అనూహ్య రీతిలో పోలీసులకు చిక్కారు. బుధవారం నగరంలోని ఎల్బీనగర్‌లో ట్రాఫిక్‌ పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా.. స్కూటీపై వస్తున్న ఇద్దరు మైనర్లను గుర్తించారు. వారిని ఆపి వివరాలు అడగగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో తల్లిదండ్రులకు ఫోన్‌ చేయగా.. విస్మయకర విషయాలు బయటపడ్డాయి.

బాలురిద్దరు మూడు రోజుల క్రితం రాజమండ్రిలోని ఇళ్లలో నుంచి డబ్బుతో సహా పరారయ్యారని తెలిసింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ. 2.20 లక్షల విలువైన నగదుతో పాటు 2 సెల్‌ఫోన్లు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement