నగరంలోని అంబర్‌పేట తహశీల్దార్ కార్యాలయాన్ని సిబ్బంది బారుగా మార్చారు.
హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేట తహశీల్దార్ కార్యాలయాన్ని సిబ్బంది బారుగా మార్చారు. మద్యం, మాంసంతో కార్యాలయంలోనే విందు చేసుకొని జల్సాలు చేశారు. ఆదివారం సెలవు అయినప్పటికీ కార్యాలయం తెరచి, మధ్యాహ్నం నుంచి తహశీల్దార్ బాలశంకర్‌తో పాటు ఆర్‌ఐలు, సర్వేయర్లు, అటెండర్లు అంతా కలిసి మద్యం సేవిస్తూ గడిపారు.
సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు సాయంత్రం అక్కడికి వెళ్లగా.. వారిని చూసి తహశీల్దార్ బాలశంకర్‌తో పాటు ఇతర ఇబ్బంది పరుగున బయటకు వెళ్లిపోయారు. కార్యాలయంలో మద్యం సీసాలు, మాంసం ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. డస్ట్‌బిన్‌లు మద్యం సీసాలతో నిండిపోయాయి. గతంలో కూడా ఈ కార్యాలయంలో ఇలాంటి మద్యం, మాంసం విందులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. కాగా, కార్యాలయంలో పని చేసే శాంతమ్మ అనే అటెండర్ బదిలీ కావడంతో ఆమె నాగదేవతకు మొక్కు తీర్చేందుకు భోజనం ఏర్పాటు చేయగా వెళ్లానని తహశీల్దార్ బాలశంకర్ తెలిపారు.