ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీ ఆస్తుల పంపకాల వ్యవహారం సీరియల్ కథలా సాగుతోంది. పరిపాలన పరంగా ఉద్యోగుల్ని విభజించినా..
ఆగస్టు ఆఖరుకు షీలాభిడే కమిటీ గడువు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీ ఆస్తుల పంపకాల వ్యవహారం సీరియల్ కథలా సాగుతోంది. పరిపాలన పరంగా ఉద్యోగుల్ని విభజించినా.. ఆస్తుల విభజన అంశం తేలకుండానే ఆర్టీసీ పరిపాలన వ్యవహారాలను విజయవాడకు తరలించనున్నారు. 15 నుంచి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ కేంద్రంగా పరిపాలన కొనసాగించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. ఆస్తుల సంగతి తేలకుండానే విజయవాడకు ఆర్టీసీని తరలించడంపై కార్మిక సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
ఉమ్మడిగా ఆర్టీసీ బోర్డు సమావేశం తీర్మానం లేకుండా ఆస్తుల విభజన తేలదని షీలాభిడే గతంలోనే స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా జూలై నాటికే బోర్డు సమావేశం నిర్వహించాలని, ఆస్తుల పంపకంపై తీర్మానం కాపీని అందిస్తేనే విభజనకు అడుగు పడుతుందని స్పష్టం చేసింది.