దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల నిందితులకు రిమాండ్ | Dilsukhnagar Blast accused Waqas and Tahseen Akhtar produced nampally court | Sakshi
Sakshi News home page

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల నిందితులకు రిమాండ్

May 24 2014 2:16 PM | Updated on Oct 19 2018 7:52 PM

దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులు వకాస్, తహసీన్ అక్తర్లను ఎన్ఐఏ అధికారులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు

హైదరాబాద్ : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులు వకాస్, తహసీన్ అక్తర్లను ఎన్ఐఏ అధికారులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం వారికి జూన్ 23 వరకూ రిమాండ్ విధించింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ-1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల వద్ద గత ఏడాది ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల కేసుల్లో వారు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. వారికి మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్‌కు ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది.

ఈ సందర్భంగా నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాను కూడా లోనికి అనుమతించలేదు. స్థానిక కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసి ఇద్దరు ఉగ్రవాదుల్నీ తమ కస్టడీలోకి తీసుకుని దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో విచారణ జరపాలని ఎన్‌ఐఏ సన్నాహాలు చేస్తోంది. ఈ కేసులో రెండు, ఐదో నిందితులుగా ఉన్న అసదుల్లా అఖ్తర్, యాసీన్ భత్కల్‌లను గత ఏడాదే నగరానికి తరలించి విచారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement