స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు | delhi bound spicejet flight landed immediately after technical snag | Sakshi
Sakshi News home page

స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు

Apr 25 2016 9:23 AM | Updated on Sep 3 2017 10:43 PM

స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు

స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు

ఢిల్లీ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానానికి ప్రమాదం తృటిలో తప్పింది. ఉదయం 8.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరిన విమానం సాంకేతిక సమస్యలతో కొద్ది నిమిషాలకే వెంటనే మళ్లీ ల్యాండయింది.

ఢిల్లీ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానానికి ప్రమాదం తృటిలో తప్పింది. ఉదయం 8.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరిన విమానం సాంకేతిక సమస్యలతో కొద్ది నిమిషాలకే వెంటనే మళ్లీ ల్యాండయింది. ఆ విమానంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు. దాంతో ఓ ప్రకటన చేసి, విమానాన్ని మళ్లీ ల్యాండ్ చేస్తున్నట్లు చెప్పారు.

ఏం జరుగుతోందో తెలియని పరిస్థితిలో ప్రయాణికులంతా టెన్షన్‌కు గురయ్యారు. అయితే కాసేపటికి విమానం సురక్షితంగానే ల్యాండ్ అయింది. వెంటనే ప్రత్యామ్నాయం ఏర్పాటుచేస్తామని విమానయాన సంస్థ వర్గాలు అన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఆదివారం కూడా తిరుపతి వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో ఇలాంటి సాంకేతిక సమస్యే తలెత్తింది. దాంతో దాన్ని కూడా కొద్దిసేపటికే మళ్లీ ల్యాండ్ చేశారు. సోమవారం ఏకంగా వీఐపీలు ఉన్న విమానంలోనే లోపం రావడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement