గ్రేటర్ అధ్యక్ష పదవికి దానం రాజీనామా | danam nagender resign as president of the Greater | Sakshi
Sakshi News home page

గ్రేటర్ అధ్యక్ష పదవికి దానం రాజీనామా

Feb 7 2016 3:25 AM | Updated on Aug 21 2018 12:12 PM

గ్రేటర్ అధ్యక్ష పదవికి దానం రాజీనామా - Sakshi

గ్రేటర్ అధ్యక్ష పదవికి దానం రాజీనామా

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి దానం నాగేందర్ వెల్లడించారు.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి దానం నాగేందర్ వెల్లడించారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పంపినట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. శనివారమిక్కడ తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమష్టికృషి లేకపోవడం వల్లనే గ్రేటర్‌లో కాంగ్రెస్ ఓటమి చవిచూసిందన్నారు. గ్రూపులను ప్రోత్సహించడం వల్లే కాంగ్రెస్ ఈ స్థాయికి దిగజారిందన్నారు.

ఈ నెల 2న పోలింగ్ ముగియగానే కాంగ్రెస్ అభ్యర్ధులు ఓడిపోతున్నట్లు చెప్పానని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలను కాంగ్రెస్ దూరం చేసుకుందని అందుకే ఓటర్లు ఈ తీర్పునిచ్చారని విశ్లేషించారు. సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలను అమలుపర్చాలని లేకుంటే ఆర్నెల్ల తర్వాత కాంగ్రెస్ నిలదీస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌కు ఎన్నికల సారథిగా పనిచేసిన మంత్రి కేటీఆర్ అందరినీ సమన్వయం చేసుకుని గెలిచారని ప్రశంసిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement