పెద్దనోట్ల రద్దుతో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నిరసనగా గురువారం హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టుగా మాజీమంత్రి, జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ ప్రకటించారు.
రేపు భారీ ర్యాలీ: దానం
సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దుతో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నిరసనగా గురువారం హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టుగా మాజీమంత్రి, జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ ప్రకటించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్, పార్టీ నగర పరిశీలకురాలు కవితారెడ్డితో కలసి మంగళవారం గాంధీభవన్ లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ దిక్కుమాలిన నిర్ణయం తీసుకుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతునిస్తూ పనికిమాలిన పనిచేస్తున్నాడని విమర్శించారు. 5వ తేదీన జరిగే ర్యాలీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ .ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పార్టీ ముఖ్యనేతలంతా హాజరవుతారని చెప్పారు