'సినిమాలు లేకనే రాజకీయాల్లోకి పవన్' | cpi ramkrishna slams ap cm chandra babu and pawan kalyan | Sakshi
Sakshi News home page

'సినిమాలు లేకనే రాజకీయాల్లోకి పవన్'

Apr 12 2016 12:50 PM | Updated on Mar 23 2019 9:10 PM

'సినిమాలు లేకనే రాజకీయాల్లోకి పవన్' - Sakshi

'సినిమాలు లేకనే రాజకీయాల్లోకి పవన్'

సినిమాలు లేకపోవడంతోనే పవన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానంటూ ప్రకటనలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విజయవాడ: పండగరోజు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాడు పనులు మానడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ డబ్బు పెట్టి కొన్న ఎమ్మెల్యేలను ఉగాది రోజున పార్టీలోకి ఆహ్వానించడం నీతిమాలిన రాజకీయమని మండిపడ్డారు. మరో వైపు ప్రజల కోసం పోరాడుతా.. ప్రశ్నిస్తానంటున్న పవన్ కల్యాణ్.. ఏం చేస్తున్నారని రామకృష్ణ ప్రశ్నించారు.

సినిమాలు లేకపోవడంతోనే పవన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానంటూ ప్రకటనలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మోదీతో మాట్లాడే దమ్ము, దైర్యం పవన్ కు ఉందా.. అని ప్రశ్నించారు. మరో పక్క ఎమ్మెల్యేల ఫిరాయింపులతో నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. పవన్ కల్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదాపై ఢిల్లీకి వెళ్లి పోరాడాలన్నారు. అందుకోసం తాము కూడా అండగా ఉంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement