సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి యత్నం..అరెస్ట్ | contract Residential teachers arrested at hyderabad cm camp office | Sakshi
Sakshi News home page

సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి యత్నం..అరెస్ట్

Feb 8 2017 10:38 AM | Updated on Sep 5 2017 3:14 AM

కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్లను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి యత్నించారు.

హైదరాబాద్‌: కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్లను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి టీచర్లు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నగరంలో బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్‌ టీచర్లు ర్యాలీగా బయల్దేదారు.

పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాటకు దారితీసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్‌ చేసి గోషామహల్‌ స్టేడియంకు తరలించారు. గతంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమ బాధ తెలపడానికి వస్తే.. పోలీసులు అరెస్ట్‌ చేయడంపై మహిళా టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement