కాంగ్రెస్ను పాతరేయడం వాళ్ల తరం కాదు: షబ్బీర్ | congress mlc shabbir ali slams kcr, ktr over projects | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ను పాతరేయడం వాళ్ల తరం కాదు: షబ్బీర్

May 7 2016 1:12 PM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ను పాతరేయడం వాళ్ల తరం కాదు: షబ్బీర్ - Sakshi

కాంగ్రెస్ను పాతరేయడం వాళ్ల తరం కాదు: షబ్బీర్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పాతరేయడం కేసీఆర్, కేటీఆర్ తరం కాదని, ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పాతరేయడం కేసీఆర్, కేటీఆర్ తరం కాదని, ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ కేటీఆర్ అహంకారంతో ఉలికిపడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనని షబ్బీర్ అన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ సహకరిస్తూనే ఉందని, అయితే చిత్తశుద్ధి లేదని కేసీఆర్కేనని ఆయన ధ్వజమెత్తారు. రీ డిజైన్ పేరుతో కేసీఆర్ చేస్తున్న అవినీతినే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆర్డీఎస్ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలనే డిమాండ్తో ఈ నెల 9న ఆర్డీఎస్ ప్రాజెక్ట్ వద్ద కాంగ్రెస్ మహాదీక్ష చేపడుతున్నట్లు షబ్బీర్ అలీ వెల్లడించారు. అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసి ఆర్డీఎస్ పనులు పూర్తి చేయాలని, తెలంగాణకు 3 టీఎంసీల సాగునీరు ఇవ్వాలని కోరతామన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement