నగరంలోని రోడ్ల పరిస్థితిపై యువజన కాంగ్రెస్ నేతలు గురువారం ధర్నా నిర్వహించారు.
గ్రేటర్ పరిస్థితులపై కాంగ్రెస్ ధర్నా..అరెస్ట్
Sep 22 2016 12:20 PM | Updated on Mar 18 2019 8:51 PM
హైదరాబాద్ : నగరంలో రోడ్లు, నాలాల దుర్భర పరిస్థితికి టీఆర్ఎస్ సర్కారే కారణమంటూ కాంగ్రెస్ నేతలు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ..హైదరాబాద్ నగరమంతా స్లమ్గా మారిపోయిందన్నారు. రోడ్లు, కాలనీలు జలమయమైనా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరాన్ని సుందరంగా మారుస్తామన్న ప్రభుత్వ ప్రణాళిక ఏమైందని ? అనిల్ ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
Advertisement
Advertisement