చదువులకు చేయూత | commitment of jntu students | Sakshi
Sakshi News home page

చదువులకు చేయూత

Feb 22 2015 12:30 AM | Updated on Sep 2 2017 9:41 PM

మెహదీపట్నం ప్రాంతంలోని జి.నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థినులు శనివారం షేక్‌పేట్ ...

జీఎన్‌ఐటీ విద్యార్థినుల సేవానిరతి
 
సిటీబ్యూరో: మెహదీపట్నం ప్రాంతంలోని జి.నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థినులు శనివారం షేక్‌పేట్ పరిధిలోని బీజేఆర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ శారద, కో ఆర్డినేటర్ మనోజ్ఞ మాట్లాడుతూ కళాశాల ఆధ్వర్యంలో 600 మంది విద్యార్థినులు ‘స్ట్రీట్ కాస్’ పేరుతో బృందంగా ఏర్పడి కళాశాల ఆధ్వర్యంలో సేవా కార్యక్ర మాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రతి నెల మురికివాడల్లోని చిన్నారులకు చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు ఆయా కాలనీల్లోని పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో ఆటలు ఆడించడం, పారిశుధ్యంపై అవగాహన కల్పించడం, మౌలిక సదుపాయాల కల్పన, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా శనివారం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసినట్లు వారు వివరించారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన 15 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement