రాజ్నాథ్ నుంచి కేసీఆర్కు ఫోన్..! | cm kcr got phone call from rajnath singh | Sakshi
Sakshi News home page

రాజ్నాథ్ నుంచి కేసీఆర్కు ఫోన్..!

Jun 29 2016 12:55 PM | Updated on Aug 14 2018 10:59 AM

(ఫైల్) ఫోటో - Sakshi

(ఫైల్) ఫోటో

టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన రాజ్భవన్కు వెళ్లారు. కేంద్రహోంశాఖ మంత్రి రాజ్నాథ్ నుంచి కేసీఆర్కు ఫోన్ రావడంతో ఆయన హడావుడిగా వెళ్లినట్లు సమాచారం.

హైదరాబాద్: టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన రాజ్భవన్కు వెళ్లారు. కేంద్రహోంశాఖ మంత్రి రాజ్నాథ్ నుంచి కేసీఆర్కు ఫోన్ రావడంతో ఆయన హడావుడిగా వెళ్లినట్లు సమాచారం. బుధవారం ఉదయం టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ భారత దేశంలో 125 కోట్ల జనాభా ఉంటే జిల్లాలు 683 ఉన్నాయని కేసీఆర్ చెప్పారు.

దేశ వ్యాప్తంగా జిల్లాల్లో సగటు జనాభా 18.3లక్షలు అని అన్నారు. కానీ, తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఇది 36లక్షలు ఉందని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. దసరాకు కొత్త జిల్లాల ఏర్పాటుపై అవసరమైన సూచనలు చేయండని కేసీఆర్ అన్నారు. కొత్త జిల్లాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఉంటుందని కేసీఆర్ చెప్పారు. ఈలోగా ఆయనకు రాజ్ నాథ్ నుంచి ఫోన్ రావడంతో సమావేశం మధ్యలో వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement