శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం | Bullet seized in shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం

Aug 19 2015 8:43 AM | Updated on Sep 3 2017 7:44 AM

హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు బుధవారం బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్: హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు బుధవారం బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని అధికారులు ప్రశ్నిస్తున్నారు. చైతన్య అనే యువకుడు ఈ రోజు ఉదయం  హైదరాబాద్ నుంచి చికాగో వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. ఆ క్రమంలో అతడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. లగేజీలో బుల్లెట్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బుల్లెట్ను స్వాధీనం చేసుకుని చైతన్యను ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement