హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ సమీపంలోని వినాయక్ సాగర్ లో ఈతకు వెళ్లిన తొమ్మిదో తరగతి విద్యార్థి నీట మునిగి మృతిచెందాడు.
హైదరాబాద్: ఈత సరదా ఓ తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రాణం తీసింది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన 14ఏళ్ల బాలుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ సమీపంలోని వినాయక్ సాగర్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది.
స్థానికంగా నివాసముంటున్న విద్యార్థి(14) ఆదివారం కావడంతో.. స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లాడు. ఈ క్రమంలో వినాయక నిమజ్జనం, బతుకమ్మ కోసం ఏర్పాటు చేసిన కుంటలో ఈతకొట్టడానికి దిగి నీట మునిగి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతిచెందాడని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.