breaking news
Vinayakasagar
-
వినాయక్ సాగర్‌లో మునిగి విద్యార్థి మృతి
హైదరాబాద్: ఈత సరదా ఓ తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రాణం తీసింది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన 14ఏళ్ల బాలుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ సమీపంలోని వినాయక్ సాగర్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న విద్యార్థి(14) ఆదివారం కావడంతో.. స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లాడు. ఈ క్రమంలో వినాయక నిమజ్జనం, బతుకమ్మ కోసం ఏర్పాటు చేసిన కుంటలో ఈతకొట్టడానికి దిగి నీట మునిగి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతిచెందాడని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. -
వినాయకసాగర్‌గా ప్రకటించాలి
గన్‌ఫౌండ్రీ: హుస్సేన్‌సాగర్‌ను వినాయకసాగర్‌గా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్‌రావు అన్నారు. వినాయకసాగరంలో గణేష్ నిమజ్జనాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. శనివారం బేగంబజార్‌లోని బెహతి భవన్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ... సెప్టెంబర్ 5న ప్రారంభమయ్యే వినాయక నవరాత్రి ఉత్సవాలు 15న సామూహిక నిమజ్జనంతో ముగుస్తాయన్నారు. గణేష్ నిమజ్జనం కారణంగా వాతావరణం కలుషితం కావడంలేదని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమర్పించిన నివేదిక స్పష్టం చేసినా, కొందరు వ్యక్తులు నిమజ్జనంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గణేష్ విగ్రహాల ఎత్తుపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని దీనిపై అపోహలు సృష్టించడం సరికాదన్నారు. రామానుజాచార్య శతజయంతి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ‘సామాజిక సామరస్యత’పై ప్రతి మున్సిపల్ డివిజన్లో సదస్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు.