నగరంలోని కూకట్‌పల్లి వేంకటేశ్వర నగర్‌లో అమానుష సంఘటన వెలుగుచూసింది.
కూకట్‌పల్లిలో అమానుషం
Sep 14 2017 11:45 AM | Updated on Jul 12 2019 3:02 PM
హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి వేంకటేశ్వర నగర్‌లో అమానుష సంఘటన వెలుగుచూసింది. అనారోగ్యంతో ఓ బాలుడు మృతిచెందగా.. వారు అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి నిరాకరించాడు. దీంతో ఆరేళ్ల బాలుడి మృతదేహంతో తల్లి రాత్రంతా వర్షంలో తడుచుకుంటూ ఇంటి బయటే ఉండిపోయింది.
డెంగీతో బాధపడుతున్న సురేష్ అనే బాలుడు బుధవారం రాత్రి మృతిచెందగా.. ఇంటి ఓనర్ మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో ఆ తల్లి నిస్సహాయ స్థితిలో మృతదేహంతో పాటు వర్షంలో తడుచుకుంటూ బయటే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు చందాలు వేసుకొని బాలుడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement
Advertisement