రేవంత్ ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు | BJP workers stopped Revanth reddy during campaigan | Sakshi
Sakshi News home page

రేవంత్ ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

Jan 25 2016 4:51 PM | Updated on Mar 29 2019 5:33 PM

రేవంత్ ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు - Sakshi

రేవంత్ ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే  రేవంత్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం అమీర్‌పేట సత్యం థియేటర్‌ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రేవంత్‌రెడ్డిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు వర్గాలను అడ్డుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2వ తేదీన గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement