
బాబు డైరెక్టర్..పవన్ యాక్టర్!
బాబు దర్శకత్వంలో పవన్ యాక్టింగ్ చేస్తూ సభలను రక్తికట్టిస్తున్నారని బీసీ నేత ఉదయ్‌కిరణ్ ఆరోపించారు.
హైదరాబాద్: సీఎం చంద్రబాబు దర్శకత్వంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ యాక్టింగ్ చేస్తూ సభలను రక్తికట్టిస్తున్నారని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ ఆరోపించారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఏపీ ప్రజలను నట్టేట ముంచేందుకు చంద్రబాబు, పవన్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బాబు అండదండలతోనే పవన్‌కల్యాణ్ సభలను నడుపుతున్నారని చెప్పారు.
పవన్‌ను ఏపీ ప్రజలు ఏనాడూ రాజకీయ నేతగా చూడలేదని, అభిమానులు మాత్రమే ఆయనను చూసేందుకు వస్తున్నారన్నారు. ప్రజారాజ్యం పెట్టి పార్టీని గంగలో కలిపిన చిరంజీవి గతే పవన్‌కూ పడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రచారానికి టీడీపీ, బీజేపీ నుంచి ఎంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో తిరిగే దమ్మూ, ధైర్యం పవన్‌కు లేవని కనీసం ప్రజా సమస్యలపై అవగాహనే లేదని ఉదయ్కిరణ్ ఆరోపించారు.