ఇకపై పత్రికల్లో వచ్చే ప్రతికూల కథనాలపై రెగ్యులర్‌గా సమీక్షిస్తామని, సంబంధిత అధికారులు వాటిపై క్షేత్రస్థాయి పరిశీలన ....
	కలెక్టర్ నిర్మల ఆదేశం
	
	సిటీబ్యూరో: ఇకపై పత్రికల్లో వచ్చే ప్రతికూల కథనాలపై రెగ్యులర్‌గా సమీక్షిస్తామని,  సంబంధిత అధికారులు వాటిపై  క్షేత్రస్థాయి పరిశీలన చేసి 24 గంటల్లో తనకు నివేదిక అందించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిర్మల ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో  సోమవారం జిల్లా అధికారులతో ఆమె మాట్లాడుతూ త్వరలో ఈ అంశంపై ఒక సమావేశాన్ని నిర్వహిస్తానని, జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని ఆదేశించారు.
	
	కేవలం పత్రికల్లో వచ్చిన ప్రతికూల కథనాలే కాకుండా శాఖలు తమ ప్రస్తుత పనితీరును మెరుగు పర్చుకోవటానికి తీసుకోవాల్సిన చర్యలు చర్చిస్తామన్నారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
