వడ్డీ వ్యాపారుల కట్టడి చట్టానికి ఆమోదం | Approved law to restrict interest of merchants | Sakshi
Sakshi News home page

వడ్డీ వ్యాపారుల కట్టడి చట్టానికి ఆమోదం

Mar 31 2016 3:07 AM | Updated on Sep 3 2017 8:53 PM

రైతులకు ఇచ్చిన అప్పులను బలవంతంగా వసూలు చేయడం, అధిక వడ్డీ తీసుకోవడం వంటి చర్యలను కట్టడి

సాక్షి, హైదరాబాద్: రైతులకు ఇచ్చిన అప్పులను బలవంతంగా వసూలు చేయడం, అధిక వడ్డీ తీసుకోవడం వంటి చర్యలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి శాసనసభ ఆమోదం తెలిపింది. చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ కుల వృత్తిదారుల నుంచి బలవంతంగా అప్పులను వసూలు చేసినా, అధిక వడ్డీ తీసుకున్నా .. అలాంటి వ్యాపారులను ఇక నుంచి కొత్త చట్ట ప్రకారం శిక్షించనున్నారు. బుధవారం శాసనసభలో డిప్యూటీ సీఎం మహ్మద్ మహమూద్ ఆలీ ‘స్టేట్ కమిషన్ ఫర్ డెబిట్ రిలీఫ్-2016’ బిల్లును ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement