ఏపీ ఎంసెట్-2016 ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను ఈ నెల 27 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ ప్రొ.సీహెచ్.సాయిబాబు తెలిపారు.
ఏపీ ఎంసెట్ కన్వీనర్ ప్రొ.సీహెచ్.సాయిబాబు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్-2016 ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను ఈ నెల 27 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ ప్రొ.సీహెచ్.సాయిబాబు తెలిపారు. ఇంటర్ హాల్‌టికెట్ నంబర్‌ను తప్పుగా నమోదు చేసుకున్నవారితోపాటు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఎన్‌ఐఓఎస్, ఏపీఓఎస్‌ఎస్, టీఎస్‌ఓఓఎస్‌ఎస్, ఆర్‌జీయూకేటీల నుంచి ఇంటర్ చదివినవారికి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ సమయంలో ప్రత్యేకంగా డిక్లరేషన్ ఫారం ఇస్తారన్నారు.
దాన్ని పూర్తిచేసి ధ్రువీకరణ పత్రాలతో మార్కుల జాబితాను అటెస్టేషన్ చేయించి ఏపీ ఎంసెట్ కన్వీనర్ ఆఫీసుకు 30 లోగా పంపాలన్నారు. రూ. 10 వేల అపరాధ రుసుంతో ఈ నెల 27 వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తామన్నారు. రూ.5 వేలు అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకున్న వారికి, మెడిసిన్‌లో పలుమార్లు పరీక్షకు హాజరవుతున్నవారికి కాకినాడ రీజినల్ సెంటర్‌లోనే పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తామని చెప్పారు.