
స్వైన్‌ఫ్లూ విజృంభణ : మరొకరి మృతి
రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మళ్లీ పంజా విసురుతోంది.
హైదరాబాద్ : రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మళ్లీ పంజా విసురుతోంది. గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఆదివారం రాత్రి మరో యువకుడు మరణించాడు. నాగర్‌కర్నూలు జిల్లా తాడూరు మండలం ఆకునెల్లికుదురు గ్రామానికి చెందిన లక్ష్మయ్య(31) స్వైన్‌ఫ్లూ కారణంగా మృతి చెందాడు.
నాలుగు రోజులుగా కర్మన్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు స్వైన్‌ఫ్లూ సోకిందని నిర్ధారించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మయ్య చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఈ నెలలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు. చలి తీవ్రతకు హెచ్1ఎన్1 వైరస్ మరింత బలపడినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.