ఎంసెట్ స్కామ్‌లో మరో వ్యక్తి అరెస్ట్ | Another man arrested in EAMCET scam | Sakshi
Sakshi News home page

ఎంసెట్ స్కామ్‌లో మరో వ్యక్తి అరెస్ట్

Aug 19 2016 8:19 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఎంసెట్ లీకేజీ కుంభకోణంలో ఢిల్లీకి చెందిన అశ్వినీకుమార్ థోమర్ అనే వ్యక్తిని సీఐడీ అరెస్టు చేసింది.

ఎంసెట్ లీకేజీ కుంభకోణంలో ఢిల్లీకి చెందిన అశ్వినీకుమార్ థోమర్ అనే వ్యక్తిని సీఐడీ అరెస్టు చేసింది. అశ్వినీకుమార్ ఢిల్లీలో ఆకృతి కన్సల్టెన్సీ పేరిట కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడని... ఎంసెట్-2 లీకేజీ సూత్రధారులతో సంబంధాలు పెట్టుకొని ఇద్దరు విద్యార్థులకు ప్రత్యేక’ శిక్షణ ఇప్పించాడని సీఐడీ విచారణలో వెలుగు చూసింది. ఆ ఇద్దరిని ఎంసెట్-2 పరీక్షకు రెండు రోజుల ముందు బెంగళూరులో నిర్వహించిన క్యాంపుకు తరలించి శిక్షణ ఇప్పించాడని తేలింది. ఈ నేపథ్యంలో అశ్వినీకుమార్‌ను అరెస్టు చేసినట్లు సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా శుక్రవారం వెల్లడించారు. ఆయన ద్వారా సూత్రధారులను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement