అఖిలపక్ష నేతలు బుధవారం ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డిని కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పలు డివిజన్లలో రిగ్గింగ్ జరిగిందంటూ ..
హైదరాబాద్ : అఖిలపక్ష నేతలు బుధవారం ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డిని కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పలు డివిజన్లలో రిగ్గింగ్ జరిగిందంటూ వారు ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. గొడవలు జరిగిన ప్రాంతాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని అఖిలపక్ష నేతలు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇదే అంశంపై అఖిలపక్ష నేతలు జానారెడ్డి, లక్ష్మణ్, రమణ, శివకుమార్ తదితరులు గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు.