బెగ్గింగ్‌ మాఫియాపై చర్యలు.. | Actions on the Begging Mafia | Sakshi
Sakshi News home page

బెగ్గింగ్‌ మాఫియాపై చర్యలు..

Jan 28 2018 2:56 AM | Updated on Jan 28 2018 2:56 AM

Actions on the Begging Mafia - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో విజృంభిస్తున్న బెగ్గింగ్‌ మాఫియాపై శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై బాలల హక్కుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలను భిక్షగాళ్ల మాఫియా నుంచి రక్షించి పునరావాసం కల్పించాలని ఈ మేరకు రాష్ట్ర డీజీపీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శనివారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌ను ఆమోదించిన మానవ హక్కుల కమిషన్‌.. ఏప్రిల్‌ 11లోగా బెగ్గింగ్‌ మాఫియాపై తగిన చర్యలు చేపట్టి, నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement