ఉత్సాహంగా మారథాన్‌ 5కే రన్.. | 5K run Marthan end today at Hyderabad Hitech city | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా మారథాన్‌ 5కే రన్..

Aug 27 2016 11:06 AM | Updated on Sep 4 2017 11:10 AM

ఉత్సాహంగా మారథాన్‌ 5కే రన్..

ఉత్సాహంగా మారథాన్‌ 5కే రన్..

హైటెక్‌ సిటీలోని హైటెక్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ప్రారంభమైన 5కే రన్‌ మారథాన్‌ ముగిసింది.

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని రన్నర్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో హైటెక్‌ సిటీలోని హైటెక్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో శనివారం ఉదయం 7 గంటలకు  ప్రారంభమైన 5కే రన్‌ మారథాన్‌ ఉత్సాహంగా సాగింది. ఈ రోజు నుంచి రెండ్రోజులపాటు హైదరాబాద్‌లో ఈ (5కే రన్‌, 10కే రన్‌) మారథాన్‌ కార్యక్రమం జరుగనుంది. రేపు (ఆదివారం) హైటెక్‌ నుంచి గచ్చిబౌలి వరకు 10కే రన్‌ నిర్వహించనున్నారు.

యువతీ యువకులతో పాటు పలువురు ప్రముఖులు మారథాన్‌ కార్యక్రమంలో ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ మారథాన్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని, అందరికీ మారథాన్‌పై అవగాహన కల్పించాలంటూ పలువురు ఔత్సాహికులు అభిప్రాయపడ్డారు. కాగా, మారథన్‌ రన్‌కు 'సాక్షి' మీడియా పార్టనర్‌గా వ్యవహరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement