చర్లపల్లి జైల్లో సోదాలు :15 సెల్ ఫోన్లు స్వాధీనం | 15 cell phones recovered from Cherlapally central jail | Sakshi
Sakshi News home page

చర్లపల్లి జైల్లో సోదాలు :15 సెల్ ఫోన్లు స్వాధీనం

Sep 25 2014 1:25 PM | Updated on Sep 2 2017 1:57 PM

చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఆ శాఖ ఉన్నతాధికారుల గురువారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఆ శాఖ ఉన్నతాధికారుల గురువారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు.  జైలులోని బ్రహ్మపుత్ర, మంజీరా బ్లాకుల్లో సోదాలు నిర్వహించారు.  ఈ సందర్బంగా పలువురు ఖైదీల వద్ద నుంచి 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జైలులోని ఖైదీ తనకు బెయిల్ కావాలంటూ నేరుగా న్యాయవాదికి ఫోన్ చేయడం ఆ విషయం ఓ ఛానళ్లలో ప్రసారం అయి హల్చల్ సృష్టించింది.

దీంతో జైళ్లు శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. అందులోభాగంగా జైలులోని  పలువురు ఖైదీలను ఇప్పటికే వరంగల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అలాగే గురువారం ఉదయం ఉన్నతాధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. దీంతో ఖైదీల వద్ద నుంచి 15 సెల్ ఫోన్లు లభ్యమైనాయి.

Advertisement
 
Advertisement
Advertisement